వరుస పరాజయాల తర్వాత శర్వానంద్.. ఒకే ఒక జీవితం చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ సినిమా తర్వాత.. వివాహం చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు. ఇటీవల తన కొత్త సినిమాను ప్రకటించాడు.
శర్వానంద్ కెరీర్‌లో 35 వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అయితే ఈ సినిమా దర్శకుడిపై శర్వానంద్ అనసహనం వ్యక్తం చేశాడట. ఆ వివరాల్లోకి వెళితే…
ఒకే ఒక జీవితంతో లైన్లోకి…
ఈ మధ్యనే వివాహం చేసుకొని ఒక ఇంటివాడైన శర్వానంద్ ఇప్పుడు సినిమాల మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నాడు. చివరిగా ఒకే ఒక జీవితం పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొంతమేర ఆ సినిమాతో సక్సెస్ సాధించాడు. పూర్తిస్థాయిలో ఆయనకు ఆ సినిమా సక్సెస్ ఇవ్వకపోయినా కొంతవరకు తమిళంలో కూడా మార్కెట్ అయితే క్రియేట్ అయింది.
షాకింగ్ వార్త తెరమీదకు…
ఇప్పుడు ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. గతంలో దేవదాస్ వంటి సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకున్న శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ సినిమా ఎలా ఉండబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఒక షాకింగ్ వార్త తెరమీదకు వచ్చింది.
