ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. పొత్తులతో విపక్షాలు..సింగిల్ గా అధికార వైసీపీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి ప్రధాన అంశంగా మారుతోంది.
అందునా మూడు రాజధానుల వ్యవహారం మరింత కీలకం కానుంది. అమరావతికి కట్టుబడి ఉన్నామని చెబుతూ ఆ ప్రాంతంలో వైసీపీ పైన ప్రతిపక్షాలు పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమయంలోనే అధికార వైసీపీ అమరావతి పై మాస్టర్ స్కెచ్ అమలుకు సిద్దం అవుతోంది.
ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు:ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్ పాలనా..పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. వచ్చే నెల 11న విచారణకు రానుంది. రానున్న సెప్టెంబర్ నుంచి ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన సాగించేందుకు నిర్ణయించారు.
ప్రతిపక్షాలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా అమరావతి పరిధిలో రాజకీయంగా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో..ఇప్పుడు అమరావతిలోనే కొత్త ప్రణాళికలతో ఆ ప్రాంతం పైన అభివృద్ధితో పట్టు సాధించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
ప్రభుత్వం కసరత్తు:రాష్ట్రంలో నగరాలు..పట్టణాల నవీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. స్వచ్ఛనగరాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్‌లు సిద్దం అవుతున్నాయి. అందులో భాగంగానే విజయవాడ అమరావతిని కలుపుతూ మెట్రోపాలిటన్ నగరంగా మార్చే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. విజయవాడ బైపాస్ రోడ్డు వారధిగా నిలవనుంది.
