రష్మిక మందన్న.. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కన్నడంలో కిరిక్ పార్టీద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. చలో సినిమాద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమను కూడా పలకరించింది.
ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. సినిమాలన్నీ హిట్ అవుతుండటంతో గోల్డెన్ లెగ్ అనే పేరు సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందారు.
తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు చేస్తూ రష్మిక మందన్న బిజీ బిజీగా ఉంటోంది. తాజాగా రష్మిక మోసపోయిందనే వార్త సినీ పరిశ్రమలో తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రష్మిక హీరోయిన్ అయినప్పటినుంచి ఆమెదగ్గర ఒక వ్యక్తి మేనేజర్ గా చేస్తున్నారు. ఆ మేనేజర్ చేతిలో మోసపోయిందనే వార్త గుప్పుమంది.
రష్మికకు తెలియకుండా ఆ మేనేజర్ రూ.80 లక్షలను తస్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రష్మిక మేనేజర్ పై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. తనను అడిగితే ఆ డబ్బులు ఇచ్చేదానన్ని, అలా కాకుండా నమ్మక ద్రోహం చేయడం తనకు ఏమాత్రం నచ్చడంలేదని మండిపడింది. క్షణాల వ్యవధిలోనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రపంచంలో అన్నిటికంటే నమ్మక ద్రోహం చేయడమే అత్యంత దారుణమైన విషయమని, తన దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదంటూ పంపేసింది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత రష్మిక టీం నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. మేనేజర్ నిజంగానే మోసం చేశాడా? ఇదంతా ప్రచారమేనా? అనే విషయంపై రష్మిక స్పందిస్తేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
