విరాట్‌ కోహ్లీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

పరుగుల వీరుడు, రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ(Virat Kohli).. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాడు. సోషల్‌మీడియాలో ఫాలోవర్లూ ఎక్కువే. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ లోనే కోహ్లీకి 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.

అత్యంత విలువైన ఆటగాడిగా మారిన కోహ్లి ఆస్తుల విలువ రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుంది. స్టాక్ గ్రో అనే కంపెనీ గణాంకాలను వెల్లడించింది. నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లుగా తెలిపింది. అంతర్జాతీయంగా క్రికెటర్లు ఆర్జిస్తున్న ఆదాయం పరంగా చూసుకున్నా ఇది చాలా ఎక్కువ.

* కోహ్లీకి టీమ్‌ఇండియా ‘A+’ కాంట్రాక్ట్‌ ఉంది దీనిద్వారా బీసీసీఐ నుంచి రూ. 7 కోట్లు లభిస్తాయి. ప్రతి టెస్టుకు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్ కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు పొందుతాడు.

* ఐపీఎల్‌ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. దీనిద్వారా సంవత్సరానికి రూ.15 కోట్లు పొందుతాడు.

* కోహ్లీకి సొంతంగా చాలా బ్రాండ్లున్నాయి. బ్లూట్రైబ్‌, యూనివర్సల్‌ స్పోర్ట్స్‌బిజ్‌, ఎంపీఎల్‌, స్పోర్ట్స్‌ కాన్వో లాంటి ఏడు స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశాడు.

YES9 TV