అమరావతి: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం.
ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని, 175 స్థానాల్లోనూ పార్టీ జెండా ఎగరాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికోసం వైనాట్ 175 కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. ఈ విషయంలో రాజీపడట్లేదు. సరిగ్గా పనిచేయని, జనంలో లేని ఎమ్మెల్యేలకు టికెట్ల దక్కబోవంటూ ఇదివరకే హెచ్చరించారు కూడా. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొలమానంగా తీసుకుంటోన్నారు.
