బెంగళూరు: ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతి కార్పోరేట్ కంపెనీలో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తున్నది. అదే సమయంలో అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు లేడీ మేనేజర్ కు పరిచయం అయ్యాడు.
ఇద్దరూ స్నేహితులు అయ్యారు. తరువాత ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లికి ముందే ఒకే ఇంటిలో సహజీవనం చెయ్యడం మొదలుపెట్టారు. చాలాకాలం సహజీవనం చేసిన యువతి అదే ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైయ్యింది. ఈ కేసు ఇప్పుడు ఐటీ హబ్ పోలీసులకు సవాలుగా మారింది.
సహజీవనం చేస్తున్న యువతిని హత్య చేసిన ఆమె ప్రియుడిని పట్టుకునేందుకు బెంగళూరు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. యువతి హత్యకు గురైన ఈ ఘటన బెంగళూరులో కలకలం రేపుతోంది. ఆకాంక్ష (24) బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తోంది. గతేడాది ఇదే కంపెనీలో పనిచేస్తున్న అర్బిత్ (27)తో ఆకాంక్షకు పరిచయం ఏర్పడింది.
