తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలో భారీ అగ్నిప్రమాదం; కోట్ల ఆస్తినష్టం!!

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామి ఆలయ సన్నిధి వీధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయానికి దగ్గరగా ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి.

ఆలయానికి వెళ్ళే సన్నిధి వీధిలో ఇరువైపులా దుకాణాలు ఉన్నాయి. అయితే మొదట భవనంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ దుకాణంలో ఫోటో ల్యామినేషన్ మరియు దేవుళ్ళ పటాలన్నీ తయారు చేస్తుంటారు. ఈ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక దుకాణదారులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ భారీగా మంటలు ఎగసిపడటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

 

వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎండాకాలం కావడంతో భారీగా మంటలు ఎగసిపడి పక్కన ఉన్న దుకాణాల్లో కూడా ఈ మంటలు వ్యాపించాయి. ఒకపక్క విపరీతంగా ఉష్ణోగ్రతలు ఉండడం, మరోపక్క అగ్ని ప్రమాదం వల్ల వస్తున్న మంటలకు ఫైర్ సిబ్బందికి కూడా మంటలు ఆర్పడం కష్టంగా మారింది.

YES9 TV