నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు: దందాలో స్టార్ హీరోయిన్లు, ప్రముఖ డైరెక్టర్!!

గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ తాజాగా డ్రగ్స్ కేసులో కొకైన్ తో పట్టుబడిన కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం తెర మీదకు వచ్చింది.

కేపీ చౌదరిని అరెస్టు చేసిన తర్వాత ఆయనను కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.

కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన క్రమంలో పోలీసులు వద్ద నుండి కొకైన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఆయన వద్ద ఉన్న నాలుగు సెల్ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కేపీ చౌదరి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు వెల్లడించిన పోలీసులు కేపీ చౌదరికి చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు టచ్లో ఉన్నారని గుర్తించారు.

YES9 TV