హైదరాబాద్ లో వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

హైదరాబాద్ లో వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వేడి గాలులు వీయడంతో పాటు వానలు పడతాయని పేర్కొంది.

దీంతో ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు అవుతోందని తెలిపింది. మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని.. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు చోట్ల చిరుజల్లులు పడ్డాయి. తెలంగాణలోని మిగతా జిల్లాల కూడా చిరు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, గాలులతో తేలిపాటి వానలు పడే అవకాశం ఉందని వివరించింది.

రుతుపవనాలు తెలంగాణలోకి జూన్ 14 తర్వాత వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపనాలు కేరళలో విస్తారించాయని.. వీటి ప్రభావంతో ఆ రాష్ట్రమంతటా వర్షాలు పడుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో జూన్ 9 వరకు, కేరళలో జూన్ 11 వరకు కొనసాగుతుందని, జూన్ 9-11 వరకు లక్షదీప్, జూన్ 10, 11 తేదీల్లో కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

కేరళ, తమిళనాడు, లక్షదీప్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వివరించింది. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది

YES9 TV