Latest Posts

భారత వృద్ధి రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంక్.. ఎందుకంటే..?

అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల ప్రతికూల ప్రభావం ఇండియాపై కూడా పడుతోంది. ఈ క్రమంలో తొలి త్రైమాసికంలో వృద్ధి గత అంచనాల కంటే తక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తాజాగా అంచనా వేసింది.

ప్రపంచ బ్యాంక్ తాజా అంచనా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 6.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇది గతంలో అంచనాల కంటే 0.3 శాతం తక్కువని తెలుస్తోంది. దేశంలో పేదరికాన్ని తగ్గించి అభివృద్ధి జరగాలంటే ఉద్యోగాల కల్పన కీలకమని ప్రపంచ బ్యాంక్ కొత్త ప్రెసిడెంట్ అజయ్ బంగా పేర్కొన్నారు. అయితే ఆర్థిక వృద్ధి నెమ్మదించటం ఉపాధి అవకాశాల సృష్టిని కష్టతరం చేస్తుందన్నారు.

ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023లో 2.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన బంగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రుణ ఖర్చులు, ప్రైవేటు పెట్టుబడుల తగ్గుదల, ప్రభుత్వ వినియోగం ఆర్థిక ఏకీకరణ వల్ల ప్రభావితం కావడం వల్ల భారతదేశ వృద్ధి మందగించడానికి ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది.

ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వటంతో పాటు చెల్లింపుల సంస్కరణల కారణంగా 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి వృద్ధి కొద్దిగా పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దక్షిణాసియాలో మూడు వంతుల ఉత్పత్తిని కలిగి ఉన్న భారత్ లో వృద్ధి 2023 ప్రారంభంలో మహమ్మారికి ముందు దశాబ్దంలో సాధించిన దానికంటే తక్కువగా ఉంది. అయితే ఈ కాలంలో తయారీ రంగం మాత్రం పుంజుకుంది.

YES9 TV