ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.
ఇటీవలే RRR మూవీతో తన రేంజ్‌ను గ్లోబల్ లెవెల్‌కు పెంచుకున్న అతడు..
అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ తన 30వ చిత్రం ‘దేవర’ను చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో దీనిపై హైప్ ఏర్పడింది.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘దేవర’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన రెండు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ వారంలోనే ప్రారంభం కాబోతున్న కొత్త షెడ్యూల్‌లో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా భాగం కాబోతున్నారు. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.
