AI వల్ల రోడ్లపాలవుతున్న టెకీలు!

ప్రపంచంలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటలీజన్స్ (AI ). చాట్‌జీపీటీ, బార్డ్‌, బింగ్ వంటి ఏఐ టూల్స్ లాంఛ్ అయిన తర్వాత టెకీల పరిస్ధితి అద్వాన్నంగా తయారయ్యింది.

ఒక్క మే నెలలో నే AI సాంకేతికత కారణంగా దాదాపు 4,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.మరిన్ని కంపెనీలు ఆ బాటలో పయనించడానికి అడుగులు వేస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలకు తోడుగా ఇప్పుడు కూడా AI వచ్చి చేరింది.

ఖర్చు తగ్గింపు, కంపెనీలో పునర్నిర్మాణం లేదా విలీనాలతో పాటు AI కారణంగా ఒక్క మే నెలలోనే 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని తాజా రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. పై అన్ని కారణాల వల్ల జనవరి నుంచి మే వరకు దాదాపు 4 లక్షల మంది ఉపాధి కోల్పోయారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఉద్యోగ సలహా వేదిక Resumebuilder.com నిర్వహించిన మరో సర్వేలో కొన్ని US ఆధారిత కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగులకు బదులుగా ChatGPTని అమలు చేయడం ప్రారంభించాయని వెల్లడించింది.

YES9 TV