తన గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ ఓ అమ్మాయిని ఉద్దేశించి చెప్పిన మాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు ఓటీటీ మీడియా ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ నిర్వహించింది.

ఫైనల్ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా వచ్చారు. బన్నీ ఎనర్జీతోపాటు కార్యక్రమానికి వచ్చిన అభిమానుల ప్రోత్సాహం అన్నీ కలిపి తెలుగు ఇండియన్ ఐడల్ 2 విజయవంతంగా ముగిసింది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పారు. ఆమె పేరు ఏమిటంటే.. శ్రుతి. తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలేకి ఐదుగురు గాయకులు ఎంపికయ్యారు. ఎంతో మంది ప్రతిభ ఉన్న గాయనీ గాయకులు 10,000 మంది వరకు ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. అందులో నుంచి 12 మంది టైటిల్ గెలుచుకోవటానికి బరిలో నిలిచారు.

కొన్ని వారాల నుంచి వీరిమధ్య గట్టి పోటీ జరిగింది. చివరకు 5గురు బరిలో నిలిచారు. న్యూ జెర్సీ నుంచి శ్రుతి, హైదరాబాద్ నుంచి జయరాం, సిద్ధిపేట నుంచి లాస్య ప్రియ, హైదరాబాద్ నుంచి కార్తికే, విశాఖపట్నం నుంచి సౌజన్య భాగవతుల. న్యూజెర్సీకి చెందిన శ్రుతి పాట పాడిన తర్వాత.. నీ పేరు నాకెప్పుడూ స్పెషలేనని, ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే అనే అల్లు అర్జున్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన సౌజన్య భాగవతుల విజేతగా నిలిచారు. ఈ పోటీలో పాల్గొన్న వారిలో సౌజన్యకు వివాహమై రెండు సంవత్సరాల పాప కూడా ఉంది.

YES9 TV