మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పానీయాల్లో చెరుకురసం ఒకటి. దీని వల్ల మన మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
నిజానికి.. చెరకు రసం తాగితే షుగర్ వ్యాధి వస్తుందేమోనని చాలామంది భ్రమపడుతుంటారు. ఇంకా ఇతర సమస్యలు కూడా రావొచ్చని అపోహలు ఉంటాయి. ఒకవేళ మీకూ అలాంటి అపోహలు ఉంటే, వెంటనే వాటిని మెదడు నుంచి తొలగించేయండి. ఎందుకంటే.. ఈ చెరుకురసం వల్ల ప్రయోజనాలే తప్ప నష్టాలేమీ ఉండవు.
Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారు
ఈ చెరుకు రసం శరీరంలో తేమను కాపాడడంలో సహాయపడుతుంది. శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తుంది. వేసవిలో అధిక వేడి కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు లోనైనప్పుడు.. ఈ చెరుకురసం తాగితే ఎంతో మంచిది. ఇది తక్షణమే శక్తినిస్తుంది. నీరసంతో బాధపడుతున్న వారు ఈ చెరుకు రసం తాగితే.. చురుగ్గా తయారవుతారు. ఈ విషయాన్ని స్వయంగా ఆరోగ్య నిపుణులే సూచిస్తున్నారు. క్రీడాకారులు సైతం ఎక్కువగా ఈ చెరుకురసంని ప్రిఫర్ చేస్తారు. చెరకు రసంలో విటమన్ ఏ, సీ, బీ తోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ శరీరంలో ఎన్నో ముఖ్య కార్యకలాపాలకు అవసరం అవుతాయి.
