Latest Posts

ఫ్రాంచైజీ పద్ధతి ద్వారా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.?

ఈజీ ప్రాసెస్ తో డబ్బులు సంపాదించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి కోసం చూస్తున్నారా..? ఇప్పుడున్న ఈ రోజుల్లో కష్టపడకుండానే డబ్బులు సంపాదించుకోవడంపైనే ఆలోచిస్తున్నారు జనాలు.

కొందరు అలా లాభపడుతుంటే.. మరికొందరు నష్టాలబాటలోకి వెళ్తున్నారు. డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎక్కువగా ఫ్రాంచైజీల వైపు చూస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు భారీ మొత్తంలో మోసపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డబ్బులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతారు.

Shaitan Trailer: ఛీఛీ.. పచ్చి బూతులు.. పోర్న్ సినిమాలు తీసుకో పో

తాజాగా ఈ మధ్యకాలంలో ఫ్రాంచైజీ పేరిట చాలామంది ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. మోసపూరితమైన ప్రకటనలను నమ్మి యువత లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్నారు. అందుకు ఉదాహరణ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేరు ఎంబీఏ చాయ్ వాలా. దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లతో, ఇది దాదాపు ప్రతి పెద్ద, చిన్న నగరంలో స్థిరపడి ప్రజాదరణ పొందింది. MBA చాయ్ వాలా వ్యవస్థాపకుడు ప్రఫుల్ బిల్లోర్, ఇంత విజయాన్ని సాధించిన వెనుక ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్ కారణం అని చాలామంది చెబుతున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. ఎంబీఏ చాయ్ వాలా బిజినెస్ మోడల్ మొత్తం మోసం అని ఫ్రాంచైజీ పొందిన యువకులు ఆరోపిస్తున్నారు.

YES9 TV