సిద్దరామయ్య మోసం చేస్తున్నారని మండిపడిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి!

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో 5 హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిందే ఇప్పుడు చేస్తున్నారా ? అని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పెడుతున్న కండిషన్స్ చూస్తుంటే ప్రకటించిన హామీలు అటక ఎక్కుతాయని ప్రహ్లాద్ జోషి అనుమానం వ్యక్తం చేశారు.

 

గతంలో ప్రకటించిన విధంగా 200 యూనిట్ల విద్యుత్ ఎందుకు ఉచితంగా ఇవ్వడం లేదని సీఎం సిద్దరామయ్యను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, అహంకారంతో మాట్లాడితే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

YES9 TV