గత శనివారం సికింద్రాబాద్ లోని మెండా మార్కెట్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 40 గంటలలోపే కొంత మంది నిందితులను పట్టుకున్నారు.
8 మంది బృందంలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం పాట్ లోని బాలాజీ నగల దుకాణంలోకి ఐదుగురు నిందితులు వచ్చారు. తాము ఐటీ అధికారులమని చెప్పి.. కిలోన్నరకు పైగా బంగారాన్ని తీసుకుని పారిపోయారు. అసలు విషయం తెలుసుకున్న దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భారీగా బంగారం చోరీకి గురి కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు 5 టీంలు ఏర్పాటు చేశారు. దుకాణం చుట్టు పక్కలా సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. నిందితులు జేబీఎస్ వైవు వెళ్లినట్లు గుర్తించారు. జేబీఎస్ వద్ద సీసీ ఫుటేజీ పరిశీలించగా వారు కేపీహెచ్బీ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత నిందితులు మహారాష్ట్ర బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల ఆధారంగా నిర్ధారించారు. బస్సు ఎక్కడి వెళ్తుందో తెలుసుకుని ఆ రూట్ లోనే వెళ్లారు.
ఓ బృందం నిందితుల కంటే ముందే మహారాష్ట్రకు వెళ్లింది. అక్కడి పోలీసుల సహకారంతో నిందితులు బస్సు దిగగానే అరెస్ట్ చేశారు. మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 8 మంది నిందితులు రెండు టీంలుగా ఏర్పడి మే 24న ప్యాట్నీలోని ఢిల్లీ లాడ్జిలో దిగారు. వారు ఒకరికొకరు పరిచయం లేనట్లుగా వేరువేరు రూమ్ లు తీసుకున్నారు. రూమ్ లు తీసుకునే క్రమంలో వారు ఆధార్ ఇచ్చారు.
అయితే వారి ఆధార్ కాకుండా మరొకరిది ఇచ్చారు. అయితే లాడ్జీ మేనేజర్ ఆధార్ కావాలని స్పష్టం చేయడం ఆధార్ వాట్సప్ చేశారు. చోరీకి వెళ్తామని నిర్ణయించుకున్న రోజు వారు వాట్సప్ లో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ చేయండంతో ఆధార్ కార్డులు డిలీట్ అయ్యాయి. అయితే ఒక బృందం సభ్యుడి వచ్చి తమ ఇంట్లో చనిపోయారని ఖాలీ చేశారు. మరో బృందం అర్జెంట్ పని ఉందంటూ రూమ్ ఖాళీ చేశారు.
వీరు లాడ్జీలో నగదు మాత్రమే చెల్లించారు. లాడ్జీలో ఉండగానే వీరు రెక్కీ నిర్వహించారు. ఒక ప్లాన్ వేసి 27 మధ్యాహ్నం ప్లాన్ అమలు చేసి బంగారం దోచుకెళ్లారు. నలుగురు మహారాష్ట్రకు వెళ్లగా.. మరో నలుగురు ఎటు వెళ్లారో పోలీసులు విచారిస్తున్నారు. అయితే బంగారం రికవరీ చేశారా లేదా పోలీసులు ఇంకా చెప్పలేదు.
