సెంట్రల్ ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సెంట్రల్ ఢిల్లీలో సమీక్ష జరగనుంది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని విపక్ష పార్టీలు బహిష్కరించడంతో పాటు జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న రెజ్లర్ల నిరసనల దృష్ట్యా పోలీసులు భారీ భద్రతను కల్పించనున్నారు. దాంతో పాటు పార్లమెంట్ కు వెళ్లే రోడ్లలో బారికేడ్లతో పాటు సరిహద్దు జిల్లాల్లో బహుళ స్థాయి భద్రతా తనిఖీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

YES9 TV