మ్యాజిక్ షోలు చేసుకుంటూ సెలబ్రిటీలను అట్రాక్ట్ చేసిన సుడిగాలి సుధీర్ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా విపరీతంగా పాపులర్ అయ్యాడు. ఇక ఈ షోలో యాంకర్ రష్మీతో లవ్ ట్రాక్ రూమర్స్ కారణంగా మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఇప్పుడు సుడిగాలి సుధీర్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అనేంతలా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సుధీర్ హీరోగా ఇప్పుడు మరో దర్శకుడితో సినిమా చేయనున్నాడు. ఇందులో తమిళ హాట్ బ్యూటి సుధీర్ సరసన నటించనుంది.
కామెడీ టైమింగ్: బుల్లితెరపైన తనదైన కామెడీ విపరీతంగా అట్రాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై సూపర్ హిట్ అయిన కామెడీ షో జబర్ధస్త్ ద్వారా పరిచయమైన సుధీర్.. సుడిగాలి సుధీర్ గా మారి అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. స్మాల్ స్క్రీన్ పై సుధీర్ తనదైన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తోపాటు అప్పుడప్పుడు డ్యాన్స్ లతో అదరగొట్టేశాడు.
ఒక హీరోగా: ఇటు బుల్లితెరపై తనదైన శైలీలో ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు సుడిగాలి సుధీర్. ఈ క్రమంలోనే త్రీమంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్, వాంటెడ్ పండుగాడ్ చిత్రాలు చేశాడు. సుడిగాలి సుధీర్ మొదట్లో హీరోగా చేసిన త్రీమంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్ అంతగా హిట్ కాలేదు. తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పించిన వాంటెడ్ పండుగాడ్ లో ఒక హీరోగా చేశాడు.
స్టార్ డమ్ కోసం: ఈ చిత్రాల తర్వాత గతేడాది గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుడిగాలి సుధీర్. ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చేయగా మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడు అందరూ మెచ్చేలా స్టార్ డమ్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు సుడిగాలి సుధీర్.
