పొన్నియన్ సెల్వన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు సరిగా ఆదరించలేదని, కావాలనే ఫ్లాప్ చేశారంటూ ట్రోల్ చేసిన కోలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు చిత్రాలని అంతకంటే దారుణంగా ట్రీట్ చేస్తారనే విషయం చాలా సందర్భాలలో రుజువు అయ్యింది రీసెంట్ గా దసరా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయితే తమిళ్ లో అస్సలు ఆదరించలేదు.
హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ 2, సీతారామం లాంటి సినిమాలు తమిళంలో పెద్దగా ప్రభావం చూపించలేదు.
అయితే తమిళ్ స్టార్ హీరోలకి తెలుగులో మాత్రం భారీ ఓపెనింగ్స్ అందిస్తూ బ్రహ్మరథం పడతారు. ఇదిలా ఉంటే మరోసారి టాలీవుడ్ హీరోకి తమిళంలో ఘోర అవమానం ఎదురైంది అని చెప్పాలి. మన హీరోకి అనేకంటే దర్శకుడు వెంకట్ ప్రభుకి మాతృభాషలో కస్టడీ విషయంలో పెద్ద పరాభవం అని చెప్పాలి. వెంకట్ ప్రభు చివరి చిత్రం మానాడు సూపర్ హిట్ అయ్యింది. అతని దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా కస్టడీ చిత్రం ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
ఈ సినిమాని దర్శకుడు వెంకట్ ప్రభు కూడా తమిళ్ డబ్బింగ్ మూవీ కాదని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కోలీవుడ్ కి చెందిన వారే, అరవింద్ స్వామి తమిళ్ స్టార్ నటుడు. ఒక్క నాగ చైతన్య మాత్రమే టాలీవుడ్ కి చెందిన వాడు. అయిన కూడా కస్టడీ డబ్బింగ్ సినిమానే అని తమిళ్ సినీ మీడియా చేస్తోన్న ప్రచారం.
తమిళంలో కస్టడీ కేవలం 2.50 కోట్ల బ్రేక్ ఎవెన్ తో రిలీజ్ అవుతుందంటే ఏ స్థాయిలో అక్కడి డిస్టిబ్యూటర్స్ మూవీని ట్రీట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే తమిళనాడులో కేవలం 100 థియేటర్స్ లో మాత్రమే కస్టడీ రిలీజ్ అవుతోంది. అయితే దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, విలన్ ఎవరూ కూడా తెలుగువారు కాకపోయిన కస్టడీ తెలుగు వెర్షన్ ఏకంగా 22.50 కోట్ల బ్రేక్ ఎవెన్ తో రిలీజ్ అవుతోంది.
అలాగే నైజాంలో 195, సీడెడ్ 100, ఆంధ్రాలో 250 థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఉంది. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 150, ఓవర్సీస్ లో 180 థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. కేవలం తెలుగు వెర్షన్ 875 స్క్రీన్స్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతూ ఉండటం విశేషం. ఇక తెలుగు, తమిళ్ భాషలలో కలిసి 25 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ తో కస్టడీ ప్రేక్షకుల ముందుకి రాబోతూ ఉండటం విశేషం. చైతన్య కెరియర్ ఇది పెద్ద బిజినెస్ డీల్ అని చెప్పాలి. మరి దానిని ఏ స్థాయిలో మూవీ అందుకుంటుంది అనేది చూడాలి.
