తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించిన చిత్రం కస్టడీ. నాగచైతన్య, కృతిశెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తిని రేపడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. మే 11వ తేదీన రిలీజవుతున్న ఈ చిత్రం ప్రీమియర్, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్: ఇక కస్టడీ సినిమాకు ఓవర్సీస్‌లో మోస్తారు ఓపెన్సింగ్ కనిపించాయి. ఈ చిత్రం అమెరికాతోపాటు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో ప్రీమియర్లతోపాటు రెగ్యులర్ షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అమెరికాలో భారీగా రిలీజ్ చేస్తుంటే..యూకే, ఆస్ట్రేలియాలో అక్కడి రేంజ్‌కు తగినట్టుగా రిలీజ్ చేస్తున్నారు.
కస్టడీకి ఆస్ట్రేలియాలో: ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ మధ్యకాలంలో షోలు పెంచుతూ పోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి 28 షోలు ప్రదర్శిస్తుండగా.. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 250 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో 18 లక్షల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు అయ్యాయి. అయితే గత తెలుగు సినిమాలతో పోల్చుకొంటే చాలా పూర్‌గా కలెక్షన్లు నమోదయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
యూకేలో అడ్వాన్స్ బుకింగ్: కస్టడీ సినిమాకు సంబంధించి యూకే అడ్వాన్స్ బుకింగ్‌కు పెద్దగా స్పందన కనిపించడం లేదు. దాదాపు 28 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరిగాయి. తొలి రోజు కోసం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 2650 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో సుమారు 19 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి. అయితే గతంలో థ్యాంక్యూ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కూడా రావడం లేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
