Latest Posts

వైష్ణవ్ తేజ్ సైలెంట్ అయ్యాడేంటి..

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా హిట్ తో మరో మెగా హీరో బాక్సఫీస్ ని చెడుగుడు ఆడేందుకు వచ్చాడని అనుకున్నారు.

కానీ ఫస్ట్ సినిమా హిట్ అందుకున్న అతను తర్వాత తీసిన రెండు సినిమాలు నిరాసపరచాడు. క్రిష్ తో కొండపొలం చేసిన వైష్ణవ్ తేజ్ ఆ నెక్స్ట్ రంగ రంగ వైభవంగా సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఉప్పెన హిట్ పడేసరికి తర్వాత రెండు సినిమాలను వెంట వెంటే చేసిన వైష్ణవ్ తేజ్ ఆ రెండు ఫ్లాప్ అయ్యే సరికి నాల్గవ సినిమా నెమ్మదిగా చేస్తున్నాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే లేకపోతే మాత్రం మెగా హీరో కెరీర్ రిస్క్ లో పడే అవకాశం ఉంది. ప్రీ లుక్ పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ వావ్ అనిపించాడు. మరి ఈ సినిమా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది చూడాలి. వైష్ణవ్ తేజ్ కూడా సెలెక్టెడ్ సినిమాలు చేసి హిట్ ట్రాక్ కాపాడుకోవాలని చూస్తున్నాడు.

YES9 TV