Latest Posts

రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం!

సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. విశాఖ నగరంలో మధురవాడలో ఐటి టెక్ పార్కుకు, విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారు.

ఈసారి సిఎం జగన్‌ తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లోనే భోగాపురం, అక్కడి నుంచి మధురవాడ వద్ద ఐటి హిల్స్ చేరుకొని సాయంత్రం హెలికాఫ్టర్‌లోనే తాడేపల్లికి తిరిగివెళ్ళబోతున్నట్లు సమాచారం. కనుక వైసీపీ నేతలకు దారిపొడవునా ఫ్లెక్సీలు కట్టే బాధ తప్పిపోయింది.

వైసీపీ నేతలు తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ మధురవాడ, భోగాపురం, సవరవెల్లి వద్ద ఫ్లెక్సీ బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది సహజమే. అయితే విశాఖలోని జనజాగరణ సమితి కూడా “రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం” అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. వాటిని పోలీసులు, వైసీపీ కార్యకర్తలు తొలగిస్తున్నారు.

అయితే ఆ బ్యానర్లో పేర్కొన్న మాట వాస్తవమే అని అందరికీ తెలుసు. అమరావతి వద్దనుకొని మూడు రాజధానులు ఏర్పాటు చ్స్తామని చెప్పుకొంటూ నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసి రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో నిలబెట్టింది. ఎందుకంటే ప్రజలు, ప్రతిపక్షాలు, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి అమరావతి రాజధానిగా భావిస్తుంటే, వైసీపీ అందుకు ఒప్పుకోకుండా ఓ సారి మూడు రాజధానులని ఓసారి విశాఖ ఒక్కటే రాజధాని అని చెప్పుకొంటోంది. అయితే ఇంతవరకు విశాఖను రాజధానిగా చేయడానికి జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా కనీసం సిఎం జగన్‌ విశాఖకు తరలివచ్చేందుకు కూడా సాహసించలేకపోతున్నారు. ఈ కారణంగా ఏపీకి రాజధాని ఏదో తెలీని పరిస్థితిలో ప్రజలు, వైసీపీ నేతలు ఉన్నారు. కనుక “రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం” అని జనజాగరణ సమితి ఎద్దేవా చేస్తోంది.

రాజధాని కధ తెలుగు టీవీ సీరియల్లాగా సాగుతుంటే, నాలుగేళ్ళు సంక్షేమ పధకాలతో కాలక్షేపం చేసేసి ఈ ఎన్నికల సంవత్సరంలో మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో తెలీని పరిస్థితులలో కొత్త పనులకు, గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేసినవాటికి సిఎం జగన్‌ మళ్ళీ శంకుస్థాపనలు చేస్తుండటం విడ్డూరమే కదా?

Posted Under AP
YES9 TV