విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన శ్వేత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశామని విశాఖ సీపీ త్రివిక్రమ్ తెలిపారు.
శ్వేతది ఆత్మహత్య అని తేల్చిన పోలీసులు అత్తమామలు వేధించారని తెలిపారు. శ్వేత పేరు మీదున్న భూమిని భర్త పేరుపై రాయాలని ఒత్తిడి తెచ్చారన్నారు. ఈ క్రమంలోనే భూమి తమ పేరుపై రాయాలని చిత్రహింసలు పెట్టారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో గృహ హింసతో పాటు లైంగిక వేధింపులు కేసు నమోదు చేశామని, ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
