స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కాంబినేషన్‌లో అఖిల్ అక్కినేని, నూతన నటి సాక్షి వైద్య, డినో మారియా, ముమ్ముట్టి లాంటి అగ్రతారలతో తెరకెక్కించిన ఏజెంట్ చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది.
స్పై, థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ భారీగా అంచనాలు పెంచుతున్నది. ఇటీవల ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్సాన్ వస్తున్నది. ఏజెంట్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
Agent మూవీ బడ్జెట్:యాక్షన్, డిఫరెంట్ జోనర్‌తో రూపొందిన ఏజెంట్ సినిమా దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా కరోనా, ఇతర కారణాల ప్రభావంతో బడ్జెట్ భారీగా పెరిగింది. ఈ సినిమాను రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతున్నది.
Agent ఆస్ట్రేలియా ఓపెనింగ్స్:ఏజెంట్ సినిమాకు ఆస్ట్రేలియాలో భారీగానే అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయింది. ఈ సినిమాను 18 లోకేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 22కిపైగా షోను ప్రదర్శించడానికి ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో 300 టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఇంకా రెండు రోజులు ఉన్నందున అడ్వాన్స్ బుకింగ్ నంబర్స్ పెరిగే అవకాశం ఉంది.
Agent యూకేలో అడ్వాన్స్ బుకింగ్:యూకేలో ఏజెంట్ సినిమా ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమాను 37 లొకేషన్లలో 45 షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి 3 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. పొన్నియన్ సెల్వన్ కంటే ఈ సినిమాకు ఎక్కువ క్రేజ్ కనిపించడం విశేషంగా మారింది.
Agent అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్:ఇక అమెరికాలో ఏజెంట్ ఫీవర్ అందుకొన్నది. ఈ సినిమా ప్రీమియర్‌ను గురువారం అంటే ఏప్రిల్ 27న ప్రదర్శించేందుకు రంగం సిద్దమైంది. ఈ సినిమాను 154 లోకేషన్లలో 254 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు 35K అమెరికన్ డాలర్లను రాబట్టింది.
Agent హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్:ఇక హైదరాబాద్‌లో ఏజెంట్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి 129 షోలు ప్రదర్శించబోతున్నారు. ఇప్పటి వరకు 21 శాతం బుకింగ్ జరిగింది. దాంతో ఈ సినిమా 25 లక్షల వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. ఇంకా రెండు రోజుల ఉంది కాబట్టి ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది.
