అఖిల్ అక్కినేని నటించిన యాక్షన్ మూవీ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలి అని అఖిల్ ఆశపడుతున్నాడు. ఇక ఏజెంట్ అతని కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ గా భారీ స్థాయిలోనే బిజినెస్ చేసింది. సినిమాకు భారీ స్థాయిలో పాజిటివ్ టాక్ వస్తేనే సక్సెస్ అయినట్లు లెక్క. లేకపోతే ఏమాత్రం తేడాగా టాక్ వచ్చినా కూడా భారీ స్థాయిలో నష్టాలను చూసే ప్రమాదం కూడా ఉంది. ఇక ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో ఉంది అనే వివరాల్లోకి వెళితే.. ఏజెంట్ బిగ్ కాంబినేషన్: మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాలతో మంచి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సురేందర్ రెడ్డి ఈసారి వక్కంతా వంశీ అందించిన కథతోనే ఏజెంట్ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఈ సినిమాలో అఖిల్ ఒక స్పైగా కనిపించబోతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముంటీ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఏజెంట్ బడ్జెట్ ఎంతంటే..: ఇక ఈ సినిమాకు భారీ బడ్జెట్ తోనే నిర్మించాల్సి వచ్చింది. AK ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. అసలైతే మొదట సినిమాను 50 కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా సినిమాకు యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఎక్కువ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో మొత్తంగా ఈ సినిమాకు 80 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం.
అఖిల్ అక్కినేని నటించిన యాక్షన్ మూవీ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28వ తేదీన గ్రాండ్ గా విడుదల
