Latest Posts

ఓవర్సీస్‌లో పొన్నియన్ సెల్వన్ 2 మూవీకి భారీ ఓపెనింగ్స్..

దేశంలో గర్వించ దగిన దర్శకుడు మణిరత్నం చిరకాల స్వప్నం పొన్నియన్ సెల్వన్ చిత్రం పార్ట్ 1 ఇప్పటికే విడుదలై భారీ విజయం అందుకొన్న సంగతి తెలిసిందే.

ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ తన సొంత బ్యానర్ లైకా ప్రొడక్షన్‌పై నిర్మించి పార్ట్ 2 చిత్రాన్ని ఏప్రిల్ 28 తేదీన రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. విక్రమ్, త్రిష, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య మీనన్ లాంటి నటీనటులు నటించిన ఈ చిత్ర ప్రమోషన్స్ జోరందుకొన్నాయి. ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలకు తగినట్టుగా అడ్వాన్స్ బుకింగ్ ఉందా? అనే విషయంలోకి వెళితే..

తమిళనాడులో భారీగా ఓపెనింగ్స్: పొన్నియన్ సెల్వన్ 2 చిత్రానికి తమిళనాడులో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ చెన్నైలో ఇటీవల మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన 413 షోలు చెన్నైలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే 52 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యాయి. దాంతో ఈ సినిమాకు 1.3 కోట్ల రూపాయలు కలెక్షన్లు వసూలు అయ్యాయి. ఇంకా రెండు రోజులు ఉన్నందున్న అడ్వాన్స్ బుకింగ్ మరింత పెరగవచ్చని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.

అమెరికాలో తమిళ వెర్షన్‌కు: పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర అడ్వాన్స్ బుకింగ్‌కు అమెరికాలో మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమాను యూఎస్‌లో 478 లోకేషన్లలో 1470 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటి వరకు 440K అమెరికా డాలర్లు వసూలు చేసింది. తమిళ వెర్షన్‌కు 415K, తెలుగు వెర్షన్‌కు 25K అమెరికన్ డాలర్లు రాబట్టింది.

ఆస్ట్రేలియాలో అడ్వాన్స్ బుకింగ్ ఎలా ఉందంటే?: ఆస్ట్రేలియాలో పొన్నియన్ సెల్వన్ 2 సినిమా అనూహ్యమైన స్పందన వ్యక్తమవుతన్నది. ఈ సినిమాను 82 లోకేషన్లలో, 289 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10700 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి.. ఇంకా ఈ రేంజ్ పెరిగే అవకాశాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి.

YES9 TV