Latest Posts

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ వచ్చేది అప్పుడే.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ కావడంతో జూన్ 16న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని టి-సిరీస్ భూషణ్ కుమార్ నిర్మించిన సంగతి విదితమే.

ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తూ ఉండగా సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. లంకేశ్ రావణ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే విజువల్ గ్రాండియర్ గా మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు. త్రీడీలో సినిమా ఉండబోతోంది.

ఇక రామ, రావణ యుద్ధాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించినట్లు ఇప్పటికే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ ని ఓం రౌత్ స్టార్ట్ చేసేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీని ఎలా అయిన గ్రాండ్ గా మార్కెట్ లోకి తీసుకొని వెళ్లాలని దర్శకుడుగట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మూవీపై ఉన్న నెగిటివ్ వైబ్ ని పూర్తిగా దూరం చేసి పాజిటివ్ బజ్ పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ అప్డేటెడ్ వెర్షన్ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.

అలాగే హనుమాన్, శ్రీరాముడి కొత్తలుక్స్ కూడా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక వచ్చేనెలలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అఫీషియల్ గా ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. కానీ ట్రైలర్ నెక్స్ట్ మంత్ రావడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. మే3 లేదా 17 తేదీలలో ఏదో ఒక రోజు ట్రైలర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంట. ఇక ఈ ట్రైలర్ నిడివి 3:22 నిమిషాల నిడివి ఉంటుందంట. గ్రాండియర్ గా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసి మూవీపై అంచనాలు పెంచాలని ప్రయత్నంలో చిత్ర యూనిట్ ఉందంట.

 

దానికి తగ్గట్లుగానే ట్రైలర్ కట్ ని అమేజింగ్ గా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ బిజినెస్ హై అండ్ లోజరుగుతుందని ఆశిస్తున్నారు. ఇక జూన్ 13న ఈ సినిమాని న్యూయార్క్ లో ట్రిబికా ఫిల్మ్ ఫెస్టివల్ గా స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించబోతూ ఉన్నారు. ఈ ఫెస్టివల్ లో ప్రదర్శితం అవుతున్న మొట్టమొదటి ఇండియన్ మూవీ ఆదిపురుష్ కావడం విశేషం.

YES9 TV