కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి. మే 8వ తేదీలోపు ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు, మంత్రికి డీఎస్ఎస్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురం నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. చిక్కబళ్లాపురం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు చాలా మంది ఉన్నారు. చిక్కబళ్లాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వేలలో ఉన్నాయి.
వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉరి వేసుకున్న గర్ల్ ఫ్రెండ్, ఎంజాయ్ చేసిన ప్రియుడు!
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ఆయన పేరు వెనుక రెడ్డి అనే ట్యాగ్ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తాను రెడ్డి అని చెప్పుకోవడానికి డాక్టర్ సుధాకర్ పెద్దగా ఆసక్తి చూపించరని, ఆయన అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. దళిత సామాజిక వర్గానకి చెందిన ప్రోఫసర్ బి. క్రిష్ణప్ప స్థాపించిన దళిత సంఘర్షణ సమితి ( డీఎస్ఎస్) నాయకులు డాక్టర్ సుధాకర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
శనివారం విలేకరులతో మాట్లాడిన డీఎస్ఎస్ నాయకులు ప్రొఫెసర్ క్రిష్ణప్ప కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఒకే నాణానికి చెందిన రెండు ముఖాలు అని, ఆ రెండు పార్టీలు ఇంతకాలం దళితులను మోసం చేసి వారిని ఓట్ల కోసం వాడుకుంటున్నారని, ఆ రెండు పార్టీల నాయకులు చిక్కబళ్లాపురంలోని దళితులను నిలువునా మోసం చేశారని ఆరోపించారు.
చిక్కబళ్లాపురం జిల్లాలోని దళితులు అందరూ డాక్టర్ సుధాకర్ కు ఓటు వెయ్యాలని, మిగిలిన నియోజక వర్గాల్లోని ప్రజలు కూడా బీజేపీని ఆధరించాలని డీఎస్ఎస్ నాయకుడు ప్రొఫెసర్ క్రిష్ణప్ప అన్నారు. దళితులను మోసం చేసిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని డీఎస్ఎస్ నాయకులు ఇదే సందర్బంలో చిక్కబళ్లాపురం అసెంబ్లీ నియోజక వర్గం ప్రజలకు మనవి చేశారు.
దళపతుల అడ్డాలో మోదీ ఎంట్రీ, మాజీ ప్రధాని, మాజీ సీఎంకు షాక్ మీద షాక్, కథ !
కర్ణాటక మంత్రి డాక్టర్ సుధాకర్ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు చాలా సన్నిహితుడు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు బెంగళూరు వచ్చినా ఆయన్ను మంత్రి డాక్టర్ సుధాకర్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ ఫ్రీరిలీజ్ ఈవెంట్ కూడా కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో నిర్వహించడం, ఆ కార్యక్రమం సక్సస్ కావడానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన డాక్టర్ సుధాకర్ అన్ని విదాలుగా సహకరించారు.
