Latest Posts

నాచురల్ స్టార్ నాని( Nani) ‘దసరా(Dasara)’ ఇచ్చిన హిట్ తో ఎంజాయ్

నాచురల్ స్టార్ నాని( Nani) ‘దసరా(Dasara)’ ఇచ్చిన హిట్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే జోరులో తన తర్వాతి సినిమాని కూడా ప్రకటించేశాడు.

కొత్త దర్శకుడు శౌర్యవ్ తో సినిమా చేయనున్నట్లు రీసెంట్ గా వెల్లడించాడు . ఈ సినిమాతో నాని తన ఆస్థాన డైరెక్టర్ గా పేరుందిన శైలేష్ కొలను తో పోటీ పడనున్నాడు. నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’, ‘హిట్-2′ ఈయనే దర్శకుడు. శైలేష్ దర్శకత్వం వహిస్తున్న’ సైంధవ్’ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(Venkatesh), శ్రద్ధ శ్రీనాథ్( Sraddha Srinath) జంటగా నటిస్తున్నారు.

మరోవైపు నాని ప్రకటించిన సినిమా సైతం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తండ్రి కూతుర్ల ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. డిసెంబర్ మూడు వారంలో లాంగ్ వీకెండ్ ఉండటంతో ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి. ఐదు రోజులు పాటు సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు.

మరోవైపు నాని నటించిన రీసెంట్ చిత్రం ‘దసరా’ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది . శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్( Keerthi Suresh) కథానాయక. దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

YES9 TV