Latest Posts

మహేష్ – త్రివిక్రమ్ సినిమా: మహేష్ డైలాగులు

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లది ఒక విచిత్రమైన కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజా.

ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్స్ కాదు. అతడు పర్వాలేదనిపిస్తే, ఖలేజా నిరాశపరిచింది. అయితే ఈ రెండు సినిమాలు తర్వాత కల్ట్ స్టేటస్ ను సాధించాయి. ఇప్పటికీ టివిలో రిపీట్స్ వేస్తె ఈ రెండు సినిమాలదే ఆధిపత్యం.

అతడులో చాలా సటిల్ గా చేసే మహేష్ ను చూసాం. ఇక ఖలేజాకు వచ్చేసరికి పూర్తి భిన్నం. మహేష్ యాక్టివ్ మోడ్ లో ఐదో గేర్ లో దూసుకుపోయాడు. మరి ప్రస్తుతమున్న మహేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో మహేష్ ఎలా మాట్లాడతాడు, డైలాగులు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి కచ్చితంగా ఉంటుంది. అసలే త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు కదా మరి.

YES9 TV