ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులు మరియు సినీ ప్రముఖులు పలువురు చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుదీర్ఘ కాలంగా చంద్రబాబు నాయుడుకు చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల కారణంగా విభేదించినా కూడా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి.
ఆ సన్నిహిత్యంతోనే చంద్రబాబు నాయుడుకు ట్విట్టర్ ద్వారా.. శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
చిరంజీవి ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడుకు తమ వంతు శుభాకాంక్షలు తెలియజేశారు.
