రానా దగ్గుబాటి, వెంకటేష్ లీడ్ రోల్స్ లో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ గత నెలలో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో మనం చూసాం. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్ కు ఇప్పుడు రెండో సీజన్ రాబోందిట.
ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ స్వయంగా వెల్లడించింది. త్వరలోనే సెకండ్ సీజన్ విడుదలవుతుంది అని తెలిపింది.
రానా నాయుడు మొదటి సీజన్ ఆడియన్స్ పెదవి విరుపుకి కారణమైంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ రానా నాయుడు కంటెంట్ పై తీవ్ర అభ్యంతరం తెలియజేసారు. ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేష్ ఇలాంటి రోల్ చేయడం చాలా మంది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.
రానా నాయుడులో ఉపయోగించిన పదజాలం, అడల్ట్ కంటెంట్ గురించి పక్కనపెట్టినా ఈ సిరీస్ కథ, స్క్రీన్ ప్లే విషయంలో కూడా విమర్శలు వచ్చాయి. రానా నాయుడు చుట్టూ నెగటివిటీ ఉన్నా కానీ దీనికి సెకండ్ సీజన్ ను తీసుకురావడం సాహసమనే చెప్పాలి.
