మాస్ మహారాజా కెరీర్ లో ఒక్క హిట్ ఒచ్చిందంటే వరసగా రెండు లేదా మూడు ప్లాప్స్ వచ్చి పడిపోతుంటాయి. రాజా ది గ్రేట్ తర్వాత నుండి ఇది అనాదిగా వస్తోంది.
చాలా ప్లాపుల తర్వాత క్రాక్ తో మళ్ళీ ట్రాక్ ఎక్కాడు రవితేజ. అయితే ఆ తర్వాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచి రవితేజను డౌన్ చేసాయి.
గతేడాది చివర్లో ధమాకాతో లైన్లోకి వచ్చాడు రవితేజ. ధమాకా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రవితేజ ప్రధాన పాత్రలో నటించిన వాల్తేర్ వీరయ్య కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ నెల విడుదలైన రావణాసుర డిజాస్టర్ గా మారింది.
ఇక రవితేజ నుండి వస్తోన్న నెక్స్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు. రవితేజ నుండి వస్తోన్న మొదటి ప్యాన్ ఇండియన్ చిత్రమిది. మరి ఈ సినిమాతోనైనా రవితేజ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి.
