Latest Posts

చియాన్ విక్రమ్ అంటేనే ప్రయోగాలకు పెట్టింది పేరు

చియాన్ విక్రమ్ అంటేనే ప్రయోగాలకు పెట్టింది పేరు. తన పాత్ర కోసం ఎంత దూరమైనా వెళ్లే కమల్ హాసన్ తరహాలోనే విక్రమ్ కూడా ఒక పాత్రకు కమిట్ అయ్యాడంటే ఎంతకైనా తెగిస్తాడు.

ఫిజికల్ గా ఎంత స్ట్రైన్ అయినా తీసుకుంటాడు. అపరిచితుడు నుండి మొదలుకుని ఐ తర్వాత ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన విక్రమ్ ఇప్పుడు అన్నిటికంటే ఛాలెంజింగ్ పాత్రను చేస్తున్నాడు. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందుతోన్న సినిమా తంగలాన్.

హిస్టారిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే పీరియాడిక్ చిత్రం ఈ తంగలాన్. విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా మేకింగ్ వీడియోతో పాటు చిన్న గ్లిమ్ప్స్ ను కూడా విడుదల చేసారు. ఇక విక్రమ్ లుక్ నిజంగానే షాకింగ్ గా ఉంది. ఫిజికల్ గా గుర్తుపట్టలేని విధంగా, ఒంట్లో సత్తువలేని పాత్రలో విక్రమ్ అందరికీ షాక్ ఇచ్చాడు.

మరి ఈ సినిమాతోనైనా విక్రమ్ నిఖార్సయిన హిట్ అందుకుంటాడేమో చూడాలి.

YES9 TV