లక్నో: లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కూడా మరణించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.
అతని అంత్యక్రియలు ముగిసిన వేళ- అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌పై కాల్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ సమాచారం అందిన వెంటనే ప్రయాగ్ రాజ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ప్రయాగ్ రాజ్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తక్షణ చర్యలు తీసుకుంటోన్నారు. కాల్పులు జరిగిన వెంటనే ప్రయాగ్ రాజ్‌లోని పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.
