ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మీద ‘మార్గదర్శి’ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు, కేసులు.. ఇదంతా చూస్తూనే వున్నాం.!
ఎంత పెద్ద కేసునైనా, తన అనుభవంతో గట్టెక్కేసే రామోజీరావుని, మార్గదర్శి వ్యవహారం అస్సలు వదలడంలేదు.!
ఆఖరికి, మంచమ్మీద పడివున్న స్థితిలో, ఈ కేసుకి సంబంధించి సీఐడీ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది రామోజీరావు. ఆరోగ్యంగానే వున్నారట, కానీ.. మంచమ్మీద పడి వున్న పొజిషన్‌లోనే విచారణకు సహకరిస్తానని చెప్పారట రామోజీరావు. ఇది, ఈ కేసు తీవ్రతను చెప్పకనే చెబుతోంది.
వైసీపీ, రామోజీరావు మీద ఆరోపణలు చేయడం.. అనేది రాజకీయం కావొచ్చు. కానీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పట్టువదలని విక్రమార్కుడిలా రామోజీపై పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి చెబుతున్నట్లే, రామోజీకి ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ క్రమంలో అనూహ్యంగా నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు, రామోజీని కీర్తిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు.
రామోజీరావుని తెలుగు ప్రజల ఆస్తిగా అభివర్ణించేశారు రఘురామకృష్ణరాజు. ఇంతకన్నా భావదారిద్ర్యం ఇంకేముంటుంది.? ప్రజారాజ్యం అనే ఓ రాజకీయ పార్టీని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి రామోజీరావు. రాజకీయాల్లో మార్పు కోసం పుట్టింది ప్రజారాజ్యం పార్టీ.
తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాయడం తప్ప, గడచిన రెండు మూడు దశాబ్దాలుగా, ఈనాడు మీడియా జనోద్ధరణకు ఏమైనా పాటుపడిందా.? ఫిలింసిటీ కడితే, రామోజీ ఎలా తెలుగు ప్రజల ఆస్తి అవుతారో ఏమో.! ఆయన చేస్తున్నది వ్యాపారం.! మీడియా కావొచ్చు, ఫిలిం సిటీ కావొచ్చు, పచ్చళ్ళు, మార్గదర్శి కావొచ్చు.. రామోజీ చేసింది జస్ట్ వ్యాపారం.!
