Latest Posts

టాలీవుడ్ గుసగుస..! బన్నీతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ చిత్రం..!

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People media factory) మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో త్వరలో సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఓ బేబీ, గూఢచారి, వెంకీమామ, కార్తికేయ-2, ధమాకా.. వంటి సూపర్ హిట్లతో టాప్ ప్రొడక్షన్ హస్ గా ఎదుగుతోంది.

ఇటివల జరిగిన అల్లు అర్జున్ (Allu Arjun) బర్త్ డే సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People media factory) స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అమెరికా గగన వీధుల్లో ‘హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్’ అనే బ్యానర్ ను ఓ చిన్న విమానానికి ట్యాగ్ చేసి ఎగుర వేసింది. ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అల్లు అర్జున్ (Allu Arjun) కు ఘనమైన బర్త్ డే విషెష్ చెప్పింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People media factory).

దీంతో త్వరలోనే బన్నీతో భారీ చిత్రం నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బన్నీతో సినిమా కన్ఫర్మ్ అయితే సంస్థ పేరు ప్రఖ్యాతులు మరింత పెరిగినట్టే.

YES9 TV