Latest Posts

‘మిసెస్ ఇండియా గ్లోబల్’ ఫైనల్స్ కు తెలంగాణ యువతి

పెగాసిస్ సంస్థ నిర్వహిస్తున్న ‘మిస్సెస్ ఇండియా గ్లోబల్’ ఫైనల్ కు తెలంగాణకు చెందిన సినీ నటి అంకిత ఠాకూర్( Ankitha Thakur) అర్హత సాధించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. తెలంగాణ తరఫున ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 11న కొచ్చి లో జరుగునున్న ఫైనల్స్ లో తెలంగాణ ప్రజలందరూ మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ.. తన కజిన్ అంకితకు అభినందనలు తెలిపారు. అంకిత కచ్చితంగా కిరీటం గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలందరూ తనకి ఓటింగ్ వేసి గెలిపించాలని కోరారు. గతంలో రష్మీ ఠాకూర్( Rashmi Thakur) మిస్ ఏసియా టైటిల్ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం రష్మీ, అంకిత సినిమాల్లో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.

YES9 TV