సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలను ఎంత ఇష్టపడతాడో తన కుటుంబంతో కలిసి ఫారిన్ వెకేషన్స్ కి వెళ్ళడానికి కూడా అంతే ఇష్టపడతాడు. కోవిద్ సమయంలో రెండేళ్ల పాటు ఎక్కడికీ వెళ్లలేకపోయిన మహేష్, ఆ లోటుని వడ్డీతో తీర్చేసుకుంటున్నాడు.
ఏడాదికి నాలుగైదు ఫారిన్ ట్రిప్స్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నాడు.
ఈ ఏడాది ప్రారంభంలోనే యూరోప్ ట్రిప్ కు చెక్కేసాడు మహేష్ తన ఫ్యామిలీతో. తాజా సమాచారం ప్రకారం మహేష్ అండ్ ఫ్యామిలీ మరో ఫారిన్ ట్రిప్ కు చెక్కేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
తాజా షెడ్యూల్ ముగుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ కు రెండు వారాల సమయం ఉంది. దీంతో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. తిరిగి వచ్చాక నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుంది. ప్రతీసారి లానే మే లో ఇక్కడ ఎండల నుండి తప్పించుకునేందుకు మరోసారి ఫారిన్ టూర్ ఉంటుంది బాబుకి.
