Latest Posts

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ లో మెరవబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. పఠాన్ లో సల్మాన్ చిన్న కామియో చేసాడు.

షారుఖ్ తో నటించిన సన్నివేశాలు చిత్రాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లాయి.

దీంతో ఈసారి ఈ ఇద్దరు ఖాన్ స్టార్స్ తో ఫుల్ లెంగ్త్ స్పై సినిమాను ప్లాన్ చేస్తున్నారు యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్. ఇప్పుడు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వచ్చాయి. పఠాన్, వార్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ – సల్మాన్ ల మల్టీస్టారర్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.

టైగర్ వెర్సస్ పఠాన్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరి 2024 నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలై 2025లో విడుదలవుతుంది. ఇక ఈ నెల సల్మాన్ ఖాన్ చిత్రం కిసి కా భాయ్ కిసి కి జాన్ చిత్రం విడుదల కానుంది. అలాగే జూన్ 2న షారుఖ్, అట్లీ దర్శకత్వంలో చేస్తోన్న జవాన్ రిలీజ్ అవుతుంది.

YES9 TV