సోషల్ మీడియాలో నెటిజన్ల బూతు పాండిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! ప్రముఖులు కూడా ఆ బూతు పాండిత్యాన్ని ప్రదర్శిస్తే.?
దాన్ని దిగజారుడుతనం అనే అనాలి.! పైగా, ఆ బూతు పాండిత్యాన్ని సమర్థించుకుంటే.. అలాంటివాళ్ళని ఏమని అనాలో కూడా అర్థం కాని పరిస్థితి.
ఆయన పేరు పరకాల ప్రభాకర్.! అదేనండీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త.! గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసి, ఆ పార్టీ మీద విషం చిమ్మి, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళిన ‘మేధావి’.! టీడీపీ హయాంలో పలు పదవులు నిర్వహించిన పరకాల, ఇప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు.
కానీ, సోషల్ మీడియాలో అడపా దడపా కనిపిస్తుంటారు. ఓ నెటిజన్, పరకాల ప్రభాకర్‌ని విమర్శించాడు. అదీ ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తెస్తూ. దానికి సంయమనం కోల్పోయాడాయన. వయసు మీద పడిందన్న ఇంగితం కూడా లేకుండాపోయింది పరకాల ప్రభాకర్‌కి. రాయడానికి వీల్లేని బూతుల్ని సోషల్ మీడియాలో దంచేశాడు.
నిజానికి, ఇది ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో కూడా.. అంటే, కొద్ది రోజుల క్రితం మరింత జుగుప్సాకరమైన పదజాలాన్ని ప్రయోగించారు. పరకాల ప్రభాకర్ ట్వీట్లను ఆయన సతీమణి గనుక చూస్తే, అసహ్యించుకుంటారన్నదాంట్లో సందేహమే అవసరం లేదు.
‘పరకాల ప్రభాకర్‌గారూ.. మీరేనా ట్వీట్లేస్తున్నది.? ఎవరైనా మీ ట్విట్టర్‌ని హ్యాక్ చేశారేమో..’ అని ఓ పరకాల అభిమాని ప్రశ్నిస్తే, ‘ఔను, నేనే.. ఆ పాండిత్యం ప్రదర్శించింది.. అలా ఆ భాషలో చెబితేనే, వాళ్ళకు అర్థమవుతుంది..’ అన్నట్టుగా సమర్థించుకున్నారు పరకాల ప్రభాకర్.
ఈయనొక మేధావి.. ఈయనొక పండితుడు.! ధైర్యముంటే, పరకాల ట్విటర్ అకౌంట్ ఓసారి చూసి, అందులో ట్వీట్ రిప్లయ్స్ చదివి తరించండి.. ఆ బూతు పాండిత్యాన్ని.!
