Latest Posts

2023–24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ ను ఆవిష్కరించిన సీఎం జగన్..

2023–24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24 ను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,96,148.09 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించామన్నారు మంత్రి చెల్లుబోయిన. అనంతరం 2023-24 సంవత్సరానికి సంబంధించి వివిధ సంక్షేమ పథకాలు, వాటికి కేటాయించిన నిధుల వివరాలను పొందు పరచిన క్యాలెండర్‌ను సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

Posted Under AP
Editor