Latest Posts

యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టిన ప్రియాంక చోప్రా..

హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌లో తన ఫస్ట్‌లుక్‌ను ప్రియాంక చోప్రా వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో ప్రసారం కానున్న ఈ సిరీస్‌లోని తన పాత్రకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ రిచర్డ్ మ్యాడెన్‌తో కలిసి ప్రియాంక చోప్రా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సిరీస్‌లో స్టాన్లీ టుక్కి కూడా కీలక పాత్రను పోషిస్తున్న విషయం ఫస్ట్ లుక్ పోస్టులో వెల్లడైంది. ఈ ఫస్ట్ లుక్ వివరాల్లోకి వెళితే..

రిచర్డ్ మ్యాడెన్‌తో కలిసి

యాక్షన్, రొమాంటిక్ సిరీస్‌గా రూపొందుతున్న సిటాడెల్‌లో ప్రియాంక చోప్రా తుపాకులతో హంగామా చేస్తూ కనిపించింది. రిచర్డ్స్ మ్యాడెన్‌తో యాక్షన్ సీన్లలో అదరగొట్టినట్టు కనిపించింది. ప్రియాంక రివీల్ చేసిన ఫోటోలు చూస్తే.. భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయనే విషయం స్పష్టమైంది.

నాదియ షా పాత్రలో ప్రియాంక చోప్రా

సిటాడెల్ సిరీస్‌లో నాదియ షా పాత్రలో నటిస్తున్నారు. రిచర్డ్‌తో హాట్ హాట్‌గా రొమాన్స్ చేసినట్టు ఫస్ట్ లుక్ ద్వారా స్పష్టమైంది. రిచర్డ్, ప్రియాంక మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండినట్టు తాజా ఫోటోలు వెల్లడిస్తున్నాయి.

ఆరు ఎపిసోడ్స్‌తో సిటాడెల్

సిటాడెల్ సిరీస్ విషయానికి వస్తే. ఆరు ఎపిసోడ్స్ ఉంటాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆంథోని రుస్సో, జో రుస్సో సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటలీ, ఇండియన్ వెర్షన్లు కూడా సిద్దమవుతున్నాయి. స్టాన్లీ టుచీ, లెస్లీ మాన్విల్లేతో కలిసి రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జోనాస్ నటించిన గ్లోబల్ స్పై సిరీస్ సిటడెల్ ఫస్ట్ లుక్ ఇమేజెస్‌ను, ప్రీమియర్ తేదీని ప్రైమ్ వీడియో వెల్లడించింది.
ఈ ఎపిక్ థ్రిల్లర్ ఏప్రిల్ 28న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది.

ఇండియన్ వెర్షన్‌లో సమంత
ఇక ఇండియన్ వెర్షన్ విషయానికి వస్తే. సిటాడెల్‌ను ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో సమంత రుత్ ప్రభు, వరుణ్ ధావన్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానున్నది. ఇండియన్ వెర్షన్ సిటాడెల్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇదే..

YES9 TV