చిరంజీవి సినిమాలో యంగ్ హీరో.. ఏకంగా ఆ పాత్రలోనే!

రాజకీయాల కోసం యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చి.. సుదీర్ఘ విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో.. అప్పటి నుంచి ఆయన మరింత ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించి మెప్పించారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ అనే చిత్రంతో ఆ

డియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి భారీ స్పందన దక్కడంతో కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సురేఖ వాణి ఓవర్ డోస్ హాట్ షో: అలాంటి షర్ట్‌లో లోపలివి కనిపించేలా! మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే మరికొన్ని చిత్రాలను కూడా లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. అందులో తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ ఒకటి. దీన్ని టాలీవుడ్‌లో ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ తీస్తుండడంతో ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేశారు. ఇటీవలే ఓ భారీ కాస్టింగ్‌తో సాగే సాంగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారు.

YES9 TV