\ ఒకటి కొంటే మరో టికెట్ ఉచితం.. అయినా షాకింగ్‌గా షెహజాదే కలెక్షన్లు!

అల వైకుంఠపురంలో సినిమా రీమేక్‌గా రూపొందిన బాలీవుడ్ చిత్రం షెహజాదా. బాలీవుడ్ యువ తారలు కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. తొలి రోజు ఉత్తర భారతంలోని మాస్ పాకెట్స్‌లో భారీ స్పందనను రాబడుతున్నది. అయితే ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా యాంట్ మ్యాన్, పఠాన్ సినిమాల నుంచి భారీ పోటీ ఎదుర్కొంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో షెహజాదా సినిమా తొలి రోజు కలెక్షన్ల, రెండో రోజు వసూళ్ల అంచనా వివరాల్లోకి వెళితే… తొలి రోజు అంతంత మాత్రంగానే.. శుక్రవారం అంటే ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన షెహజాదా చిత్రం తొలి రోజు పెద్దగా ప్రేక్షకులను రప్పించలేకపోయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శనివారం రెండో రోజు మహాశివరాత్రి కావడంతో ఈవెనింగ్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. బయ్ వన్.. గెట్ వన్ స్కీమ్ కార్తీక్ ఆర్యన్ నటించిన షెహజాదా సినిమా కలెక్షన్లు తొలి రోజు నిరాశపరిచాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఒక టికెట్ కొంటే.. రెండో టికెట్ ఉచితం అనే స్కీమ్ పెట్టినా ఆడియెన్స్ స్పందించలేదు. నేషనల్ వైడ్‌గా మల్టీప్లెక్స్‌లో తప్పా.. మాస్ పాకెట్స్‌లో ఓ మోస్తారుగా కలెక్షన్లు వచ్చాయి అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

YES9 TV