తెలంగాణలో గ్రూప్‌-4 ఎగ్జామ్ డేట్ ని టీఎస్‌పీఎస్సీ ఫిక్స్

తెలంగాణలో గ్రూప్‌-4 ఎగ్జామ్ డేట్ ని టీఎస్‌పీఎస్సీ ఫిక్స్ చేసింది. జూలై 1న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. పేపర్‌ 1 పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 వరకు, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందని పేర్కొంది. గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మెుత్తం 8, 180 పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, వార్డు ఆఫీసర్‌ పోస్టులు, జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి. గ్రూప్-4 దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 30 నుంచి కొనసాగుతోంది. గ్రూప్-4 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ. ఇప్పటివరకు 9 లక్షలకు పైగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. tspsc.gov.in వెబ్ సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున 300 మార్కులకు ఉంటుంది.

YES9 TV