Latest Posts

సోనియా ఆత్మకథలో తెలంగాణ ఏర్పాటు ప్రస్తావన ఎందుకు లేదు?.. కాంగ్రెస్‌ను నిలదీసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!

సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్‌’ ఆత్మకథలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఎందుకు ప్రస్తావించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంటే, పుస్తకంలో ఆ విషయమే లేకపోవడానికి కారణం ఏంటని నిలదీశారు. ‘తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే’ అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఈ ప్రశ్నకు తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ దయాభిక్ష కాదని, అది కేవలం తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితమని కేటీఆర్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ వ్యాఖ్యలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ఏర్పాటుపై ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో భాగంగా 2011 నవంబర్ 16 నుంచి 21 వరకు తాను చేపట్టిన పాదయాత్రకు 15 ఏళ్లు పూర్తయినట్లు తెలిపారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపు మేరకు ఆరు రోజుల పాటు సాగిన ఆ పాదయాత్ర తన జీవితంలో ఒక గొప్ప జ్ఞాపకమని పేర్కొంటూ, నాటి ఉద్యమ చారిత్రక సందర్భాలను ఆయన ప్రస్తావించారు.

Editor