Latest Posts

దేవరగట్టు బన్నీ ఉత్సవాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ సమీక్ష… ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు…

దేవరగట్టు బన్నీ ఉత్సవాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ సమీక్ష… ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు…

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దేవరగట్టులో పర్యటించారు.

బన్నీ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా అధికారులు, భక్తులు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకొని దేవరగట్టు బన్నీ ఉత్సవాల సమయంలో దాడులకు దిగినా, ఘర్షణలకు పాల్పడినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బన్నీ ఉత్సవాలు జరిగే ప్రాంతంలో పోలీసుల నిరంతర 110 సీసీ కెమెరాలు నిఘా ఉంటయని , శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

ఉత్సవాల పేరుతో గొడవలకు దిగే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ, భక్తులందరూ పోలీసులకు సహకరించి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అధికారులు కోరారు.

Posted Under AP
Editor