గుత్తిలో ఘోర రోడ్డు ప్రమాదం
లారీ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చెరువు కట్ట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంతకల్ నుంచి గుత్తికి బైక్ పై వస్తున్న యశ్వంత్, భార్గవ్ అనే ఇద్దరు యువకులను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
